జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల పరిధిలోని రేజింతల్ సిద్ధి ఆలయానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మంగళవారం అంగారక సంకట చతుర్థి సందర్భంగా రేజింతల్ సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ విగ్నేశ్వరుని వేడుకుంటున్నట్టు తెలిపారు.