రాయికోడ్: పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

75చూసినవారు
రాయికోడ్: పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు
సంగారెడ్డి రాయికోడ్ మండల పరిధిలోని నాగ్వార్ గ్రామంలో మంగళవారం పశువులకు గాలి కుంటు వ్యాధి టీకాలను పంపిణీ చేసినట్లు పశు వైద్య అధికారి డాక్టర్ పాండ్యన్ తెలిపారు. పశు సంపదను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలను పంపిణీ చేసిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్య సిబ్బంది మైనో గాన్, దేవదాస్, సిబ్బంది పెంపకందారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్