జహీరాబాద్ నియోజకవర్గం ఝారాసంఘం మండల పరిధిలోని బర్ధిపుర్ ఆశ్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కె. ప్రసాద్ రెడ్డి సోమవారం దర్శించారు. శ్రీ దత్తగిరి స్వామి వారికి పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు వైదిక పాఠశాల విద్యార్థులు రాజగోపురం వద్ద స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి వేదం ఉచితంగా నేర్పించడం, వేద పాఠశాల కొనసాగించడం అభినందనీయమన్నారు.