సంగారెడ్డి: సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన కలెక్టర్
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి విద్యానగర్ లో సమగ్ర కుటుంబ సర్వేను కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం పరిశీలించారు. ఆయన డోర్లకు అతికించిన స్టిక్కర్లను చూశారు. వాటిపై నమోదు చేసిన ఇంటి నెంబర్, ఎన్యుమరేటర్ బ్లాక్, క్రమసంఖ్య, తదితర వివరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.