18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని మొగుడంపల్లి తహసీల్దార్ హసీనా బేగం గురువారం తెలిపారు. ఇంకా ఓటరుగా నమోదు కాని వారికి ఈ నెల 8, 9 రెండు రోజుల పాటు
ప్రత్యేక ఓటరు నమోదు చేపడుతున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. పోలింగ్ బూత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉంటారని, నూతన ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.