ఒలింపిక్ పతక విజేత షూటర్ సరబ్‌జ్యోత్ సింగ్‌కు హర్యాణా ప్రభుత్వం క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఉద్యోగ్యాన్ని ఆఫర్ చేసింది. అయితే ఇందుకు సరబ్‌జ్యోత్ నో చెప్పారు. తాను షూటర్‌గానే కొనసాగాలనుకుంటున్నట్లు తెలిపారు. ఒలింపిక్ గోల్డ్ సాధించాలనే తన లక్ష్యం కోసం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను మార్చుకోలేనని, అందుకే ప్రస్తుతానికి ఈ జాబ్ చేయలేనని ఆయన పేర్కొన్నారు.