TG: సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌లో కొత్త టెన్షన్ మొదలైంది. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇప్పుడే వస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓట్లు ఎలా అడగాలని బీఆర్ఎస్ నాయకులు మల్లాగుల్లాడు పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ తరపున సర్పంచ్ పదవికి పోటీ పడే సరైన వ్యక్తి కూడా దొరకటంలేదని సమాచారం.