గొప్పలు చెప్పి.. 4 నెలలుగా జీతాలు ఇవ్వరా?: హరీశ్ రావు

64చూసినవారు
గొప్పలు చెప్పి.. 4 నెలలుగా జీతాలు ఇవ్వరా?: హరీశ్ రావు
తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్లకు 4 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 'మా హయాంలోని రిక్రూట్ మెంట్ ను మీ ఖాతాలో వేసుకున్నారు. అట్టహాసంగా నియామక పత్రాలు ఇచ్చి.. జీతభత్యాలను పట్టించుకోలేదు. జీతాలు అందక 4వేల మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇస్తామని గొప్పలు చెబుతున్న నేతలు వాస్తవాలు గుర్తించాలి. వెంటనే జీతాలు చెల్లించాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్