TG: నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చనున్నారు. నిఖేశ్ కూమార్‌తో పాటు ఆయన బంధువుల పేరుతో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన ఆస్తుల విలువ రూ.17,73,53,500గా తేలింది. బహిరంగ మార్కెట్‌లో సదరు అక్రమాస్తుల విలువ దాదాపు రూ.100కోట్లు ఉంటుందని అంచనా.