శ్రీవారి ఆలయానికి ఆక్టోపస్ బలగాలతో భద్రత

1040చూసినవారు
శ్రీవారి ఆలయానికి ఆక్టోపస్ బలగాలతో భద్రత
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి ఆక్టోపస్ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల తిరుమలలో భద్రతా ఏర్పాట్లను సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ టీం సూచనల మేరకు శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద ఆక్టోపస్ బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్