హైదరాబాద్‌లో అభివృద్ధి విప్లవంలా సాగుతోందని.. వ్యాపార విస్తరణకు నగరం ఎంతో అనుకూలమైనని వ్యాఖ్యానించారు మంత్రి
కేటీఆర్. నానక్‌రామ్‌గూడలో స్టెల్లాంటిస్ డిజిటల్ హబ్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సస్టెయినబుల్ మొబిలిటీకి మాత్రమే భవిష్యత్తు ఉందన్నారు. మొబిలిటీ వ్యాలీలో స్టెల్లాంటిస్ భాగస్వామ్యం కావడం సంతోషకరమన్నారు. ప్రతి 2 ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే ఉంటున్నాయని కొనియాడారు.