అభిమానులకు సారీ చెప్పిన నిఖిల్

5107చూసినవారు
అభిమానులకు సారీ చెప్పిన నిఖిల్
టాలీవుడ్ యువ నటుడు నిఖిత్ అభిమానులకు సారీ చెప్పారు. నిఖిల్ హీరోగా నటించిన ‘స్పై’ మూవీ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది. దీనిపై నిఖిల్ మాట్లాడుతూ.. ‘స్పై మూవీ ఓవర్సీస్‌లో 350 స్క్రీన్స్‌లో ప్రీమియర్స్ కాన్సిల్ అయ్యాయి. అందుకు చాలా బాధగా ఉంది. ఇకపై చేయబోయే సినిమాల కంటెంట్‌పై జాగ్రత్త వహిస్తాను. సినిమా కథ బాగున్నప్పటికీ.. సరైన విధంగా తెరకెక్కించలేకపోయారు. క్లైమాక్స్ హడావుడిగా ఉండటం సినిమాకు మైనస్ అయింది.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్