ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌లోని అనవసరమైన లింక్‌లను నొక్కి మోసపోవద్దు. ఎంతటి ఆర్థిక అవసరమైనా యాప్‌లలో అప్పు తీసుకోవద్దని దృఢ నిర్ణయం తీసుకోవాలి. తల్లిదండ్రులకు తెలియకుండా యాప్‌ల అప్పును ఆశ్రయిస్తున్న యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఒకవేళ ఇప్పటికే తీసుకున్న బాధితులు ఉంటే ఈ వ్యథ నుంచి తప్పించుకునేందుకు 1930 సహాయక నంబరుకు ఫిర్యాదు చేయాలి. వారిచ్చే సూచనలతో సంబంధిత పోలీసులను కలవాలి.