ప్రముఖ తమిళ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల సమయంలో ఆయన బ్యాగ్‌లో 40 బుల్లెట్లు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనకు తుపాకీ లైసెన్స్ ఉందని కరుణాస్ బదులిచ్చారు. బుల్లెట్లు ఉన్నాయనే విషయం తెలియకుండా ఆ బ్యాగ్ తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు.