నాలుగేళ్ల బాలికలపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడడం కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు గత 15 రోజులుగా చిన్నారులపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక కమిటీ పేర్కొంది. పాఠశాలకు సంబంధించిన ఐడీ కూడా అతడి వద్ద లేదని తెలిపింది. స్కూల్‌లో వాష్‌రూమ్ లు దూరంగా ఉన్నాయని, పిల్లల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొంది.