మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని నావేల్ బ్రిడ్జి సమీపంలో బుధవారం అతివేగంగా వెళుతున్న స్టేషనరీ ట్రక్, భారీ క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు రెండు వాహనాల మధ్యలో చిక్కుకోవడంతో తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న PMRDA అగ్నిమాపక దళం.. ఆ ఇద్దరిని రక్షించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.