తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సీఎం రేవంత్ సతీమణి గీత, కుమార్తె, అల్లుడు, మనవడు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.