అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఇదే

63చూసినవారు
అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఇదే
దీపావళి సందర్భంగా ఢిల్లీ నుంచి పాట్నా వరకు ప్రత్యేక వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడుపుతున్నారు. దీంతో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే వందే భారత్ రైలుగా ఇది రికార్డు సృష్టించనుంది. ఇవాళ ఢిల్లీ నుంచి ఉదయం గం. 8.25 నిమిషాలకు రైలు ప్రారంభమైంది. దాదాపు 994 కిలోమీటర్లు ఆ రైలు ప్రయాణం చేస్తుంది. సుమారు 11గంటల 30నిమిషాల పాటు జర్నీ ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ పాట్నా చేరుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్