కొందరు యువకులు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు తమ వాహనాల నంబర్ ప్లేట్లపై ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి కూడా అలాంటి పనే చేశాడు. తన బైక్ నంబర్ ప్లేట్‌పై ఓ గ్లాస్ ప్లేటును అతికించాడు. ఇలా చేయడం వల్ల దూరం నుంచి చూస్తే మెరుస్తూ ఉంటుందని, తద్వారా కెమెరాకు కూడా నంబర్లు సరిగ్గా కనిపించవని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.