ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లోని వైద్య ఆరోగ్య శాఖలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. వాయు కాలుష్యం అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్‌కు వెళ్లడం, ఆటలు ఆడటం వంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని తెలిపింది. వ్యర్థాలను కాల్చడం, పండుగ సమయంలో బాణాసంచా కాల్చడం తగ్గించాలని పేర్కొంది.