‘‘ఓకే బంగారం’ విడుదలయ్యాక నిర్మాత దిల్రాజు నాకొక అవకాశం ఇచ్చారు. తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆ సినిమా అంగీకరించలేకపోయా’’ అని నటుడు దుల్కర్ సల్మాన్ అన్నారు. ‘లక్కీ భాస్కర్’సక్సెస్ ప్రెస్మీట్లో ఇవాళ ఆయన మాట్లాడారు. ‘నాగి 'మహానటి' కోసం నన్ను సంప్రదించినప్పుడు ఆ విషయమే చెప్పా. కానీ నన్ను తీసుకొచ్చి ఈరోజు ఇలా నిలబెట్టారు. హను 'సీతారామం'తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ధన్యవాదాలు’ అని అన్నారు.