వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

80చూసినవారు
వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
వరుస రైలు ప్రమాదాలు కారణంగా వందేభారత్, గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ల వేగంపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్‌- ఝాన్సీ మధ్య గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్, రెండు వందేభారత్‌ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగంతో నడుస్తున్నాయి. ఏటీపీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే వరకూ ఈ రెండు రైళ్ల గరిష్ఠ వేగాన్ని 130 కి.మీ.కు తగ్గించాలని ఉత్తర మధ్య రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌కు లేఖ రాశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్