ఈ రోజుల్లో ఫోన్ కేసులు చాలా అందంగా, విభిన్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఒక ఫోన్ కేసు స్టైల్‌కు సంబంధించిన వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అందులో ఒక మహిళ ఫోన్ కేస్‌లో చీమల రూపంలో ఉన్న సూక్ష్మజీవులు (చీమలు) సజీవంగా కనిపిస్తున్నాయి. ట్రాన్సాపరెంట్ కవర్ లోపల ప్రత్యేక ఏర్పాటులో యద్ధేచ్చగా తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.