అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి!

82చూసినవారు
అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి!
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇండియానాలోని చర్చి స్ట్రీట్‌లో ఉన్న నైట్‌ క్లబ్‌లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. మొత్తం 19 మందిపై కాల్పులు జరపగా.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 16 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడు కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్