అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి

683చూసినవారు
అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫిలడెల్ఫియాలోని కింగ్‌సెసింగ్ పక్కన ఉన్న వారింగ్టన్ అవెన్యూలోగల 5,700 బ్లాక్‌లో కాల్పులు చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేజియర్ స్ట్రీట్ 1,800 బ్లాక్‌లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిగిన నేపథ్యంలో మంగళవారం వీధిని తాత్కాలికంగా బంద్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్