TG: మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఎస్ఐ, మరో వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు బుధవారం రాత్రి వెలికి తీశారు. అయితే, రాత్రి నుంచి ఎస్‌ఐ సాయి కుమార్ మృతదేహం కోసం తీవ్రంగా గాలిస్తుండగా గురువారం ఉదయం ఐడెంటిఫై చేసి చెరువులోంచి బయటకు తీసుకొచ్చారు.