నిరుపేదలకు వరంగా సీఎం రిలీఫ్ ఫండ్

1378చూసినవారు
నిరుపేదలకు వరంగా సీఎం రిలీఫ్ ఫండ్
నిరుపేదలకు వరంగా సీఎం రిలీఫ్ ఫండ్ మారిందని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 2వ వార్డు కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మిసంజీవ రెడ్డి‌ అన్నారు. మంగళవారం ఉదయం వార్డుకు చెందిన ఆకుల బాలమణికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్