మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా యువగర్జన సభను జయప్రదం చేయాలని దౌల్తాబాద్ యూత్ నాయకులు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండలంలో ఈ నెల 13న వీఆర్ఆర్ గార్డెన్లో నిర్వహించనున్న యువగర్జన సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు.