దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభునిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లగా సిఎన్ఆర్ ఫ్యామిలీ పాఠశాలకు బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం వారు పాఠశాల ప్రాంగణంలో కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు.