అప్పాయి పల్లిలో పర్యటించిన ఉపాధి హామీ రాష్ట్ర సిబ్బంది

82చూసినవారు
అప్పాయి పల్లిలో పర్యటించిన ఉపాధి హామీ రాష్ట్ర సిబ్బంది
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి 2025- 26 సంవత్సరానికి పనులు గుర్తింపు కొరకు మండలంలోని అప్పాయి పల్లి గ్రామంలో పర్యటించారు. రాష్ట్ర కార్యాలయ ఈసీ అబేద్ ఖాన్. గ్రామసభలో తీర్మానిచ్చిన పనులు జరిగే ప్రాంతాలను పరిశీలించారు. వారితోపాటు డిఆర్డిఎ హెచ్ఆర్ మేనేజర్ నర్సింహారావు, ప్లాంటేషన్ మేనేజర్ మహేందర్, ఎంపీడిఓ వెంకట లక్ష్మమ్మ, ఏపిఓ రాజు, ఈసీ స్వప్న, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్