AP: విజయవాడ మేరీ మాత ఉత్సవాల్లో కొందరు యువకులు రెచ్చిపోయారు. మధురానగర్ ప్రాంతానికి చెందిన కొందరు పవన్ అనే యువకుడిని దారుణంగా కొట్టారు. బ్లేడ్లతో గాయపర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అల్లరిమూకలను చెదరగొట్టి పవన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాడి చేసిన యువకుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.