చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డు సృష్టిస్తోంది. ఈ చిత్రం మూడో రోజుకు రూ.62.37 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు మేకర్స్ 'ఎక్స్' వేదికగా ప్రకటన చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.