సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఓబీసీ వర్క్ షాప్ కార్యక్రమం ప్రధాన కార్యదర్శి గర్నేపల్లి కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఓబిసి రాష్ట్ర అధ్యక్షుడు గంధ మల్ల ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, మోడీ నాయకత్వంలో భారతదేశం అగ్రగామిగా రూపొందుతుందని అన్నారు.