సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో బుదవారం అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉప్పల కిషోర్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప దేవాలయం కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్ గురు స్వామి మాట్లాడుతూ అయ్యప్ప మాల ధారణ వల్ల సకల పాపాలు తొలగిపోయి, కోరిన కోర్కెలు నెరవేరుతాయని తెలిపారు.