ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జనరంజక పాలన కొనసాగుతున్నదని, ప్రజాపాలనతో సమస్యల పరిష్కారానికి బాటలు పడుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీలో కాంగ్రెస్ విజయోత్సవ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ 11నెలల పాలనలో ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.