సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో శనివారం కార్తీక మాసం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం శివలింగం ఓంకారం ఆకారంలో దీపాలు వెలిగించి, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో దీపారాధన చేస్తే పుణ్యం లభిస్తుందని ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.