పాఠశాలలో ఉపాధ్యాయుడి పై కోతుల దాడి

7570చూసినవారు
బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయుడిపై, విద్యార్థులపై కోతుల దాడి చేశాయి. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల మేరకు బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలోకి కోతుల గుంపు ప్రవేశించింది. గుంపులోని కోతి కిటికిలో చిక్కుకోవడంతో రక్షించడానికి ప్రయత్నించిన ఉపాధ్యాయుడు సురేశ్ బాబుపై మరో కోతి దాడి చేసింది. దీంతో ఉపాధ్యాయుడికి తీవ్రంగా గాయమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్