గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

54చూసినవారు
గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్‌లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణ పరిధి పటేల్ పురలో ఇంటిలో సంతోష్ అనే వ్యక్తి గుట్కా ప్యాకెట్లు కలిగి ఉన్నాడని సమాచారం మేరకు మంగళవారం తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు రూ. 16, 680 విలువ గల గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్