సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ సీ సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో గౌరారంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాసాని వీరేష్ శనివారం మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా హైదరాబాద్ తర్వాత ఏ కార్యక్రమమైనా విజయవంతం చేయడానికి అనుకూలమైన ప్రాంతమని అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా క్రీడాకారులకు శాశ్వతంగా కబడ్డీ క్రీడా మైదానంతో పాటు ఇండోర్ స్టేడియం కూడా నిర్మిస్తామని అన్నారు.