సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శనివారం ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి మిఠాయి పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి సమీర్ మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.