సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని గొట్లమిట్ట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి లింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంజుల రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు మంజుల రెడ్డికి ఘనస్వాగతం పలికారు. గ్రామ ప్రజాప్రతినిధులు,మంజులక్క యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.