హుస్నాబాద్ నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ను మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరితో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖి చేశారు. పాఠశాలలో ఉన్న సమస్యల పై ఆరా తీశారు. రెగ్యులర్ గా క్లాస్ లు జరుగుతున్నాయా ఉదయం టిఫిన్, ఆహారం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గదికి వెళ్లి అప్పుడే వండిన ఆహారాన్ని కూరలను పరిశీలించారు.