పేదల సంక్షేమం అభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. శనివారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలిసి పొన్నం ప్రభాకర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.