నారాయణఖేడ్ పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన జయమ్మ కుమారుడు కొండవీటి నితిన్ (12) మంగళవారం గుండెపోటుతో మరణించాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం ఉదయం 8 గంటలకు టీ, బ్రెడ్ తాగి కొద్దిసేపటి తర్వాత శ్వాస ఆడటంలేదని బాధపడుతూ ఉండగా కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు అన్నారు. బాలుడు బోధి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు.