జిన్నారం: గుమ్మడిదలలో ఈనెల 3న పట్టపగలు జరిగిన చోరీ కేసును సోమవారం పోలీసులు ఛేదించారు. సీఐ సుధీర్‌కుమార్ వివరాల ప్రకారం.. గుమ్మడిదలకు చెందిన రవీందర్‌రెడ్డి 31 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసిన వ్యక్తిని పట్టుకున్నామన్నారు. వరంగల్‌కు చెందిన హమీద్ సయ్యద్ చోరీ చేసినట్లు తేల్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150కి పైగా ఇళ్లలో పట్టపగలు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు సీఐ తెలిపారు.