పోలాల అమావాస్య ప్రాముఖ్యత

1573చూసినవారు
పోలాల అమావాస్య ప్రాముఖ్యత
శ్రావణ మాసంలో చివరి రోజును పోలాల అమావాస్య అంటారు. ఆ రోజున గోమాత పేడతో అలికి పసుపు, కుంకుమతో రాసి, కందమొక్కను నాటాలి. కందమొక్కను అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరాన్ని కందమొక్కకు కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరాంటాలకు ఇచ్చి మనం కట్టించుకోవాలి. పిండి వంటలను అమ్మవారికి నివేదన చేయాలి. భోజనం చేసిన తర్వాత తాంబూలం, దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు మరణించకుండా కలరా, మలేరియా, మశూచి తదితర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.

సంబంధిత పోస్ట్