బోయినపల్లి లోని పశు వైద్యశాలలో గురువారం డాక్టర్ రమేష్ కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి పలువురు శాలువలతో సన్మానించి పూల బోకెలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ మాజీ డైరెక్టర్ చిందం వేణు, సింగిల్ విండో వైస్ ఛైర్మెన్ నల్లల బాలరాజు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలు రైతులకు పశువులకు సేవలందించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.