హుజురాబాద్ బస్టాండు గురువారం ఉదయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. కార్తీక మాసం ముగింపు దశకు చేరుకోవడంతో జిల్లాలోని ప్రధాన ఆలయాలకు భక్తులు వెళ్తుండటంతో పాటు, పలు శుభకార్యాలు ఉండటంతో ఉదయం నుంచి బస్టాండులో రద్దీ నెలకొంది. రద్దీకి తగ్గట్టుగా సరిపడా బస్సులు నడపకపోవడం, సకాలంలో అవి రాకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బస్టాండులో బస్సుల కోసం ప్రయాణికులు ఇక్కట్లు పడాల్సి వస్తోంది.