కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇల్లంద కుంట మండలం కనగర్తి గ్రామంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రైతులతో సమావేశమై మాట్లాడారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు జరగట్లేదని రైతులు తమ దృష్టికి తీసుకు వచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. రైతుబంధు రైతు రుణమాఫీ పథకాలు రావట్లేదని ఆరోపించారు. వెంటనే రైతు భరోసా అందజేయాలని డిమాండ్ చేశారు.