కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆదివారం ప్రారంభించారు. జయన్న పౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తుండటంతో కంటి వ్యాధిగ్రస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.